Monday, December 1, 2025
E-PAPER
Homeఖమ్మంమంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఉద్యాన విద్యార్ధులు

మంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఉద్యాన విద్యార్ధులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ రాజేంద్రనగర్ ఉద్యాన విద్యా విద్యార్ధులు ఆదివారం అశ్వారావుపేట లోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్  బి.అశ్విన్ కుమార్ పర్యవేక్షణలో చివరి సంవత్సరం “ఎక్స్పోజర్ విజిట్” లో భాగంగా విద్యార్ధులు స్థానికంగా పలు  వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి ఈ ప్రాంతంలో సాగు అయ్యే ఉద్యాన పంటలు,యాజమాన్యం పద్దతులను అవగాహన చేసుకున్నారు.

టీజీ ఆయిల్ ఫెడ్ నర్సరీ,పామాయిల్ పరిశ్రమ,వ్యవసాయ కళాశాల,ఉద్యాన పరిశోధనా స్థానం,పామాయిల్,కొబ్బరి వ్యవసాయ క్షేత్రాలు,పలు ఉద్యాన మొక్కల నర్సరీలను వారు సందర్శించారు. చివరిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఆయన తో ముఖాముఖీ మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -