Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆస్పత్రి ప్రాంగణంలోనే హాస్టల్‌

ఆస్పత్రి ప్రాంగణంలోనే హాస్టల్‌

- Advertisement -

నీలోఫర్‌ బిల్డింగ్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన హెల్త్‌ సెక్రెటరీ క్రిస్టీనా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నీలోఫర్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలో 280 మంది డాక్టర్లు(పీజీ స్టూడెంట్స్‌, సీనియర్‌ రెసిడెంట్స్‌) ఉండేందుకు అనువుగా హాస్టల్‌ బిల్డింగ్స్‌ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చొంగ్తూ పరిశీలించారు. హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి స్థల పరిశీలనకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆస్పత్రిని సందర్శిం చిన ఆమె హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 180 మంది ఫీమేల్‌ డాక్టర్లు, 100 మంది మేల్‌ డాక్టర్లకు సరిపడా భవనాలు నిర్మించేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రతిపాదనలు రూపొం దించి ప్రభుత్వానికి పంపిం చనున్నట్టు క్రిస్టినా తెలిపారు.

హాస్పిటల్‌ ప్రాంగ ణంలోనే హాస్టల్‌ ఉండడం డాక్టర్లతో పాటు, పేషెంట్లకు కూడా మేలు చేస్తుందని అభిప్రాయ పడ్డారు. వందలాది మంది డాక్టర్లు 24 గంటల పాటు హాస్పిటల్‌లోనే అందుబాటులో ఉంటారనీ, తద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆమె తెలిపారు. హాస్పిటల్‌ బిల్డింగ్‌ పైన నిర్మిం చిన ఐరన్‌ స్ట్రక్చర్‌ను త్వరలోనే వైద్య సేవల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిం చారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయాలనీ, అవస రమైన రిపేర్లు చేయించాలని టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డికి క్రిస్టినా సూచించారు. హాస్పిటల్‌ ప్రాంగణంలో నిర్మించిన ధర్మశాల భవనాన్ని(జీ ప్లస్‌ 3) నిలోఫర్‌కు అప్పగించాలని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ను క్రిస్టినా ఆదేశించారు.72 రూంలు ఈ భవనంలో అందుబా టులో ఉన్నాయనీ, రోగుల సహాయకుల కోసం ఈ భవనాన్ని ఉపయో గిస్తామ ని ఆమె తెలిపారు. నిలోఫర్‌ హాస్పిటల్‌ బ్రాండింగ్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ను ఆమె ఆదేశించారు.

ప్రభుత్వ నిబంధనలు పాటించరా? క్రిస్టీనా ఆగ్రహం
హాస్పిటల్‌ వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ, రద్దీని తగ్గించే అంశంపై క్రిస్టీనా సమావేశంలో చర్చించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులతో గతంలో జరిపిన కొనుగోళ్లపై ఆమె చర్చించారు. ఈ కొనుగోళ్లలో ప్రభుత్వ నిబం ధనలు పాటించకపోవడంపై సెక్రెటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై కొనుగోళ్లు అన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరపాలని ఆదేశించారు. అవసరమైన పరికరాల కోసం హాస్పిటల్‌ సూపరిం టెండెంట్‌ ను ప్రతిపాదనలు రూపొందించాలనీ, ఆ ప్రతిపాదనలను డీఎంఈ పరిశీలించి, టీజీఎం ఎస్‌ఐడీసీకి పంపించాలని సెక్రెటరీ ఆదేశించారు. నిబంధనల ప్రకారం గ్లోబల్‌ టెండర్ల ద్వారా టీజీఎంఎస్‌ఐడీసీ కొనుగోళ్లు చేపట్టాలని ఆ సంస్థ ఎండీ ఫణీంద్ర రెడ్డికి సెక్రెటరీ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -