Tuesday, August 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅకాల వర్షంతో కూలిపోయిన ఇల్లు..

అకాల వర్షంతో కూలిపోయిన ఇల్లు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలో కురిసిన అకాల వర్షం కారణంగా పట్టణంలోని ఎనిమిదో వార్డు రామ్ నగర్ కు చెందిన మద్దెల సుశీల ఇల్లు కూలిపోయింది. దీంతో నిరుపేద కుటుంబం నిరాశ్రయులయ్యారు. కూలిపోయిన ఇల్లును రెవెన్యూ అధికారి సైదా, మున్సిపల్ అధికారులు ప్రవీణ్ నవీన్లు పరిశీలించారు. 

ఆర్థిక సహాయం చేసి, ఆదుకోవాలి
అకాల వర్షంతో ఇల్లు కూలిపోయిన మద్దెల సుశీల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ కౌన్సిలర్ పంగారెక్కల స్వామి, మాజీ కోఆప్షన్ సభ్యులు ఇటబోయిన సబితా గోపాలు విజ్ఞప్తి చేశారు. వారు కూలిపోయిన ఇల్లును పరిశీలించారు. తక్షణ ఆర్థిక సహాయంతో పాటు,  ప్రభుత్వము ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరారు. వీరితోపాటు భూతం యాదగిరి శ్రీనివాస్ రాజు, నరేందర్, వెంకటేశ్, యజమానులు  వార్డు ప్రజలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -