Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్చి 31లోపు ఇంటి పన్ను వసూలు పూర్తి చేయాలి

మార్చి 31లోపు ఇంటి పన్ను వసూలు పూర్తి చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
మార్చి 31లోపు ఇంటి పన్ను వసూలును పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేసి గ్రామ ప్రజలకు సమయానికి సేవలు అందించే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంటి పన్ను వసూలు ఎంతో ముఖ్యమని తెలిపారు.

గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి పన్ను వసూలును మార్చి 31లోపు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువులోపు పన్ను వసూలు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు సమర్థవంతంగా కొనసాగాలంటే ఆదాయ వనరులు పెరగడం అవసరమని పేర్కొన్నారు.

అనంతరం గ్రామంలోని నర్సరీలను సందర్శించాలని అధికారులకు సూచించారు.గ్రామాల్లో మొక్కల పెంపకం, వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచి గ్రామాల్లో నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి రోజు పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.

భోజనం రుచికరంగా, పరిశుభ్రంగా ఉందా లేదా అనే విషయాలను స్వయంగా పరిశీలించాలని తెలిపారు. పిల్లలకు పోషకాహారంతో కూడిన భోజనం అందేలా చూడటం చాలా అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం,చదువు అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.ఓ కిషన్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -