Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ నాయకుల ఇంటింటా ప్రచారం..

కాంగ్రెస్ నాయకుల ఇంటింటా ప్రచారం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
హైదరాబాద్ లోని జుబ్లిహిల్స్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో 362, 363 బూత్ లలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ఇందల్ వాయి మండల నాయకులు దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్, మల్లేష్ ,ప్రశాంత్  గన్నరం తదితరులు విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్ మాట్లాడుతూ.. ఎక్కడ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ హవానే ఉందని, భారీ మెజారిటీతో విజయం సాధించాడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  ఆదేశాల మేరకు మండల నాయకులు ప్రచార పర్వంలో ముందున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -