- Advertisement -
ఇబ్బందుల్లో పేదలు
నవతెలంగాణ – పాలకుర్తి
ఇటీవల కురుస్తున్న వర్షాలకు మండలంలోని శాతాపురంలో తోట పుల్లమ్మ, పశులాది సోమమ్మ ల ఇండ్లు కూలాయి. వర్షాలకు రేకుల ఇల్లు తో పాటు పెంకుటిల్లు సోమవారం కూలిందని బాధితులు తెలిపారు. ఇల్లు కూలడంతో నిరాశ్రయులయ్యామని ఆందోళన చెందారు. ప్రభుత్వం స్పందించి ఇల్లు కూలిన పేదలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని స్థానికులు కోరారు. శాతాపురం గ్రామంలో కూలిన ఇండ్లను ఎమ్మారై నరసింహ సందర్శించి పరిశీలించాడని తహసీల్దార్ నాగేశ్వరరావు చారి తెలిపారు. రెండు ఇండ్లు వర్షాలకు పాక్షికంగా కూలాయని, సహాయం కోసం కలెక్టర్ కు నివేదికను అందజేస్తామని తెలిపారు.
- Advertisement -