Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

- Advertisement -

గుమ్మడి రాజుల రామలు
నవతెలంగాణ – ధర్మసాగర్
గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వల్లెపు రమేష్ అధ్యక్షతన పక్క గృహాలు మంజూరు చేయాలని తాసిల్దార్ గారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిలుక రాఘవులు పాల్గొని మాట్లాడారు. మండలంలోని ముప్పారం గ్రామంలో సర్వే నెంబర్ 585 లో గల 5 ఎకరాలు 20 గుంటల భూమిలో గత మూడు సంవత్సరాలుగా నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన 250 మంది నివాసముంటున్నారని అన్నారు.

ఈ నిరుపేదలైన వారికి ఇండ్ల పట్టాలిచ్చి,పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపక్షంగా నిలబడలని, లేదంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం మెమోరండాన్ని తాసిల్దార్ సదానందం గారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి, అక్కడున్న భూమిని సర్వే చేయించి నివేదికను పై ఉన్నతాధికారులకు చేరవేస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు వేలు రజిత, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు ఎస్ కమిటీ సభ్యులు లావణ్య, పప్పీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -