Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeజాతీయంనకిలీ ఓట్లు ఎలా వేస్తున్నారు..?

నకిలీ ఓట్లు ఎలా వేస్తున్నారు..?

- Advertisement -

‘ఓట్ల చోరీ’పై వీడియోతో
రాహుల్‌ గాంధీ ప్రచారం
న్యూఢిల్లీ :
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నకిలీ ఓట్లు ఎలా వేస్తున్నారో వెల్లడించే కొత్త వీడియోను బుధవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. నిమిషం నిడివి కలిగిన ఈ వీడియోను విడుదల చేస్తూ.. మీ ఓట్లను దోచుకుంటున్నారు, మీ హక్కులను దోచుకుంటున్నారు, మీ ఉనికిని దోచుకుంటున్నారని పేర్కొన్నారు. బూత్‌ పర్‌ ఓట్‌ చోరీ అనే ట్యాగ్‌ను వీడియోకు జత చేశారు. ఇద్దరు వ్యక్తులు పోలింగ్‌ బూత్‌లోకి ప్రవేశిస్తుండగా.. మరో ఇద్దరు వ్యక్తులు వారిని ఆపి మీ ఓట్లు వేశామని చెబుతారు. అనంతరం అక్కడి ఎన్నికల అధికారికి దొంగ ఓటు వేసినట్టు చూపడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు.”మీ ఓటు హక్కును లాక్కోనివ్వకండి. ప్రశ్నలు అడగండి. సమాధానాలు డిమాండ్‌ చేయండి. ఓటు చోరీకి వ్యతిరేకంగా మీ గొంతుకను పెంచండి. రాజ్యాంగ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి విడిపించండి” అని ఎక్స్‌లో ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ సైతం ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా మీ స్వరాన్ని వినిపించాలని ప్రజలను కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad