ప్రజలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వీర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – వీర్నపల్లి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్, సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలపై ప్రజలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అడిగి తెలుసుకున్నారు. వీర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, ఓపీ రిజిస్టర్, మందులు, వైద్యం అందించే గదులను పరిశీలించారు. పీ హెచ్ సీ ద్వారా నిత్యం ఎందరికి వైద్యం అందిస్తున్నారో డాక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.
దవాఖాన కు వైద్య చికిత్స కోసం వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యల పై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి గత నవంబర్ నెలలో శంకుస్థాపన చేసిన పనులు ఇంకా మొదలు పెట్టకపోవడం పై ఆర్ అండ్ బీ డీఈ కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. వీరి వెంట అధికారులు , ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.