నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ నుండి సిద్దిపేట వరకు హైవే రోడ్డు పనులు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పందిల్ల గ్రామంలోని పందిల్ల బైపాస్ రోడ్ నుండి పరివేద ,రాములపల్లె , కోహెడ, కాచాపూర్ గ్రామాలకు వెళ్ళుటకు హైవే రోడ్డు ఎక్కడానికి వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాహనదారులు హైవే రోడ్డు ఎక్కేందుకు నానా తంటాలుపడుతున్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలాంటే ప్రమాదాలు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వాహనదారులు ప్రమాదానికి గురైనట్లు చెప్పిన రోడ్డు మరమ్మత్తులు చేసే కాంట్రాక్టర్ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టి గ్రామాలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని బి ఆర్ ఎస్ మండల కార్యదర్శి ఆలుమల్ల ప్రభాకర్ రెడ్డి , వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు ఇలా..వెళ్ళేది ఎలా.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



