Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ స్వగ్రామం అయినటువంటి మొగ గ్రామంలో కాంగ్రెస్, బిజెపి, పార్టీల నుండి పలువురు నాయకులు కార్యకర్తలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి మద్నూర్ మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలల నుంచి పలు గ్రామాల కాంగ్రెస్, బీజేపీల నుంచి బిఆర్ఎస్ లో భారీగా చేరికలు జరిగాయి. మొగ గ్రామం నుంచి మొగ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానీ మియా, సీనియర్ నాయకులు శీను పటేల్, గత కొన్ని రోజుల క్రితం బిఆర్ఎస్ జుక్కల్ నియోజక వర్గం ఇంచార్జి మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే సమక్షంలో చేరారు.

వారిద్దరి సమక్షంలో ఆ గ్రామం నుండి మంగళవారం పెద్ద ఎత్తున జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే ఆద్వర్యంలో వారి అనుచరులను వారి స్వగ్రామంలోనే బిఆర్ఎస్ లో చేర్పించడం జరిగింది. వీరిని జుక్కల్ మాజీ శాసన సభ్యుడు హనుమంత్ షిండే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు అధికారాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బిజెపి, పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలనకు విసుగు చెంది కెసిఆర్ పాలనే ప్రజలకు అన్ని రకాలుగా బాగు చేసిందంటూ బిఆర్ఎస్ పార్టీకి మళ్లీ పట్టం కడుతున్నారని అన్నారున ఈ కార్యక్రమంలో మద్నూర్ డోంగ్లి మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, విజయ్ పటేల్ ,ఉమ్మడి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు కాశీనాథ్ పటేల్, మద్నూర్ మాజీ సర్పంచ్ సురేష్, బి ఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మండలంలోని మాజీ సర్పంచులు మా ఎంపీటీసీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad