Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeసినిమావిడుదలకు ముందే భారీ వసూళ్ళు

విడుదలకు ముందే భారీ వసూళ్ళు

- Advertisement -

‘ఇంకా ట్రైలర్‌ కూడా విడుదల కాకముందే మా పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఓజీ’ చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రీమియర్‌ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్‌ డాలర్లను రాబట్టి ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది’ అని మేకర్స్‌ తెలిపారు.
పవన్‌కళ్యాణ్‌, దర్శకుడు సుజీత్‌ కాంబినేషన్‌లో డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మించిన చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే ‘ఓజీ’ సాధిస్తున్న ఘనత గురించి స్పందించింది.
‘పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌ డమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్‌తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘ఓజీ’ తుఫానుతో మరోసారి బాక్సాఫీస్‌ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్‌ వర్గాలు సైతం ఆయన సష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ కనువిందు చేయనున్న ఈ చిత్రం విడుదలకు మూడు వారాల ముందే.. ‘ఓజీ’గా ఆయన బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ఓజీ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్‌, ప్రతి గ్లింప్స్‌ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సష్టించాయి. దీంతో అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వసూళ్ల పరంగా బాక్సాఫీస్‌ వద్ద ప్రకంపనలు సష్టించి, మైలురాయి చిత్రంగా ఇది నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘ఓజీ’ అనే శక్తివంతమైన టైటిల్‌కి తగ్గట్టుగానే.. ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌ వద్ద పవన్‌ కళ్యాణ్‌ తుఫాను సష్టిస్తున్నారు. త్వరలోనే ఈ తుఫాను ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ప్రకాష్‌ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌ ముఖ్యపాత్రధారులు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad