ఖర్చు తక్కువ.. పవర్ ఎక్కువ
ఆశావాహుల్లో తీవ్ర పోటీ
కొన్ని గ్రామాల్లో సర్పంచ్ కంటే వార్డు మెంబర్ లోని ఎక్కువ క్రేజ్
నవతెలంగాణ కాటారం
కాటారం మండలంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సందడి నెలకొంది. కాగా సర్పంచ్ పదవిని ఆశించి రిజర్వేషన్ల మూలంగా భంగపడిన వారు ఇప్పుడు ఉప సర్పంచ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో సర్పంచి పదవిఏ కాదు.. ఉప సర్పంచ్ పోస్టుకు కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ నడుస్తున్నది.
గ్రామపంచాయతీలో సుప్రీం సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ పదవి కూడా కొన్నిసార్లు కీలకం కానుంది. సర్పంచి తో కలిసి అతడికి జాయింట్ చెక్ పవర్ ఉండడం సర్పంచిని ఏదో కారణంగా తొలగిస్తే ఆ బాధ్యతలు ఉపసర్పంచికే అప్పగిస్తారు. నిధుల వినియోగంలో, గ్రామ పాలనలో ఉప సర్పంచ్ పదవి కీలక భూమిక పోషించనున్నారు. 2018 సంవత్సరం పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఉపసర్పంచ్ కి కూడా కొన్ని అధికారాలు కల్పించారు. పంచాయతీ పరిధిలో నిధుల వినియోగంపై సర్పంచితో పాటు ఉపసర్పంచ్ కూడా అధికారం కట్టబెట్టారు.
ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచ్ ప్రభుత్వ పథకాలలో ఇతర అవినీతితో నేరం రుజువైతే కలెక్టర్ సర్పంచిని పదవి నుండి తొలగిస్తారు. ఆ సమయంలో తిరిగి ఎన్నికలు జరిగే వరకు ఉప సర్పంచ్ గ్రామ పాలన బాధ్యతలను తీసుకుంటాడు.
ఎక్కువమంది ఉప సర్పంచ్ పైన ఆశలు
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల మూలంగా సర్పంచి స్థానానికి పోటీ చేయలేని వాళ్లు కనీసం ఉప సర్పంచి నైనా నేను అవ్వాలని పట్టుదలతో ఉన్నారు. రిజర్వుడు స్థానాల్లో ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఈ పోటీ ఆశిస్తున్న వారు ముందుగా వార్డు మెంబర్గా ఎన్నికవ్వడంతో పాటు తమ వర్గానికి చెందినవారు ఎక్కువమంది వార్డు సభ్యులు విజయం సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డులో గెలుపు అవకాశాలు అభ్యర్థులకు ఆర్థిక చేతన అందిస్తూ తమ వైపుకు తిప్పుకొని ప్రయత్నం చేస్తున్నారు.
పరోక్ష పద్ధతిలో ఉపసర్పంచ్ ఎన్నిక
సర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత వార్డు సభ్యులందరికీ కలిసి ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. అయితే ఈ పదవికి పోటీ నెలకొంటే అధికారులు పంచాయతీ పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి వార్డు సభ్యులు చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించి ఎవరికి ఎక్కువ మంది సభ్యులు మద్దతు ఉంటే వారిని ఉపసర్పంచ్ గా నిర్ణయిస్తారు.



