- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాశమైలారంలో సిగాచి కంపెనీ ఘటన మరువకముందే.. మరో పేలుడు జరిగింది. బుధవారం ఉదయం పాశమైలారం పారిశ్రామికవాడలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కెమికల్ డ్రమ్ములు తగలబెడుతుండగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఆ సమయంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -