- Advertisement -
– అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ నమ్మి మోసపోయిన బాధితుడు
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సత్యసాగర్ కు గతనెల 26న ఓ వ్యక్తి అమెజాన్ డెలివరీ హబ్ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేశాడు. సత్యసాగర్ పలు దఫాలుగా రూ.1,71,690 చెల్లించాడు. మళ్లీ డబ్బులు అడగడంతో మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ శైలెందర్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు.
- Advertisement -