– పంట పొలాల్లోకి వెళ్తున్న రైతన్నలు జాగ్రత్త..
– సుమారు 70 కిలోల, మూడు మీటర్లు పొడుగు ఉన్న కొండచిలువ..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్దయుడికి గ్రామానికి చెందిన మచ్కూరి నాందేవ్ అనే రైతు వ్యవసాయ భూమి పక్కనే ఉన్న లొంగన్ గ్రామ శివారులో ఉంది. రెండు రోజుల క్రితం తనకున్న వ్యవసాయ భూమిలో సోయా పంటకు రసాయన ఎరువులు పిచికారి చేస్తున్న క్రమంలో భారీగా సుమారుగా మూడు మీటర్లు ఉన్న కొండచిలువ పాము కనిపించడంతో స్ప్రే మెషిన్ పారేసి పరుగ పరుగు తీశాడు. ఎందుకు పరిగెడుతున్నారని పక్క చేను రైతు వచ్చి చూడగా సుమారుగా భారీగా ఉన్న డెబ్బై కేజీల మూడు మీటర్ల కొండచిలువ పాము చూసి అందరూ భయాందోళనలకు గురి అయ్యారు.
ఒక రైతు ధైర్యం చేసి పామును కట్టెతో కొట్టి చంపేయడం జరిగింది. ప్రస్తుతము వర్షాలు పడుతున్న క్రమంలో, భూమి పొరలలో దాక్కొని ఉన్న పెద్ద పెద్ద పాములు త్వరలో నీటితో మునిగి మట్టి కప్పుకపోవడంతో విష జంతువులు భయ ప్రపంచంలోకి వచ్చి తలదాచుకుంటూ ఇలా పంట పొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఇటీవలే పడంపల్లి మరియు బిజ్జల్ వాడి గ్రామ శివారులలో రైతులకు భారీ కొండచిలువలను హతమార్చిన సంఘటనలు ఇటీవలే పాఠకులకు తెలిసిన విషయమే. రెండు రోజుల క్రితం కనిపించిన భారీ కొండచిలువ ఇటీవల గ్రామాలలో కనిపించిన దానికంటే పెద్దగా ఉంది. రైతన్నలు పంట పొలాలకు పనుల నిమిత్తం వెళ్తున్నప్పుడు కాళ్లకు రక్షణగా బూట్లు తోడుకొని వెళ్లాలని పెద్దలు సూచిస్తున్నారు. రైతన్నలు తస్మాత్ జాగ్రత్త.
లొంగన్ గ్రామ శివారులో భారీ కొండచిలువ కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES