నవతెలంగాణ – హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు హైకోర్టు లో భారీ ఊరట లభించింది. కూనంనేనిపై దాఖలైన ఎన్నికల పిటిషన్ చట్టవ్యతిరేకమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కూనంనేనిపై దాఖలకైన పిటిషన్‌లో.. కేవలం ఎన్నికల అఫిడవిట్‌లో భార్య పేరు ప్రస్తావించలేదనే కారణంతో.. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా.. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక కూనంనేని.. తన భార్యకు సంబంధించి గత ఐదేళ్లుగా ఐటీ రిటర్నులు, ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లాడించారని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. నిబంధనల ప్రకారమే ఆయన నామినేషన్ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టులో ఎమ్మెల్యే కూనంనేనికి భారీ ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES