Tuesday, July 1, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్భారీ విషాదం..37కు చేరిన మృతుల సంఖ్య‌

భారీ విషాదం..37కు చేరిన మృతుల సంఖ్య‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరింది. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు రౌండ్ ది క్లాక్ కొనసాగుతున్నాయి. మొత్తం 37 మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు అందులో అధికారులు 4 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. జిల్లా యంత్రాంగం, వైద్య, రెస్క్యూ, పోలీసు బృందాలు సంఘటితంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. మొత్తం 57 మంది వ్యక్తులు పూర్తి సురక్షితంగా ఇంటికి వెళ్లారని, 35 మంది ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు. వీరికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని వెల్లడించారు. మరో 27 మంది ఆచూకీ అభ్యం కాలేదని తెలిపారు. వారి మృతదేహాలు శకలాల కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 37 మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాయని, అందులో నాలుగు మృతదేహాలు గుర్తించబడ్డాయి. డీఎన్ఏ పరీక్షలకు మృతుల బంధువులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -