నవతెలంగాణ – కామారెడ్డి: మానవ హక్కుల సహాయ సంఘం తెలంగాణ సభ్యులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ – అవుట్ పోస్ట్ కామారెడ్డి రైల్వే స్టేషన్ ఏ. ఎస్.ఐ. పి రవీందర్ బాబు ను సోమవారం సన్మానించారు. గత వారం రోజులుగా కుండ పూత భారీ వర్షం కురుస్తున్న కామారెడ్డి రైల్వే స్టేషన్, తలమడ్ల, బిక్నూర్ రైల్వే స్టేషన్లు పట్టాలు విరిగిపోయి రైళ్ల రాకపోకానికి ఆటంకం కలిగినది. రైళ్లు నిలిచిపోయినావి, భారీ వర్ష కారణంగా అతలాకుతులమైన సంఘటన చోటు చేసుకుంది.
దీనికి వెంటనే స్పందించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎ.ఎస్ఐ, సిబ్బంది రాత్రింబగలు నిరంతరం గా కష్టపడి రైల్వే లైన్ ను రిపేర్ చేశారు, ఇట్టి కారణంగా గత మూడు రోజుల నుంచి ఆగిపోయిన సికింద్రాబాద్, మన్మాడ్ రైల్వే లైను ప్రస్తుతం యధావిధిగా కొనసాగుతూ రూట్ క్లియర్ చేశారు. దీనికి గాను సోమవారం కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవుట్ పోస్ట్ కామారెడ్డి యూనిట్ ఏ ఎస్ ఐ పి రవీంద్రబాబు ని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సహాయ సంఘం చైర్మన్ ఎంఏ సలీం, సభ్యులు రవీంద్ర బాబు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి శాలువా, అప్రిసియేషన్ సర్టిఫికెట్ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సహాయ సంఘం తెలంగాణ రాష్ట్ర సలహాదారులు కేతు రమణారెడ్డి, న్యాయ సలహాదారులు న్యాయవాది ఈక శ్రీనివాస్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.