Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ 

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ 

- Advertisement -
  • – ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి  ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ 
  • నవతెలంగాణ-భూపాలపల్లి
  • పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి  ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ… కాలుష్య కారకాలైన పరిశ్రమల వ్యర్థాలు, ట్రాన్స్పోర్టేషన్ మరియు అడవుల నరికివేతపై ద్రుష్టి సారించాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలన్నారు. సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ సరిగా చేయాలన్నారు. 
  • ఈ కార్యక్రమంలో అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్ రావు, స్పెషల్ పి.పి విష్ణువర్ధన్ రావు , అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్ , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్  కంప అక్షయ , జి. ప్రియాంక , న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్ , సంగేమ్ రవీందర్ , రజినీకాంత్ , భూపాలపల్లి ఎస్. ఐ. రమేష్ , కోర్టు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img