- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధి చెందిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయనికి నిర్మల్ పట్టణం వేంకటాద్రి పేట్ కు చెందిన ఆదిముల్ల వనిత – భూమేష్ దంపతులు రూ.3 లక్షల 70 వేల విలువగల రెండు పెద్ద హుండీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత దంపతులను ఆలయ కమిటీ చైర్మెన్ సింగం భోజగౌడ్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రంలో ఆలయ ఈవో భూమయ్య, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్ రెడ్డి,నాయకులు దశరథ రాజేశ్వర్, ఉట్ల రాజేశ్వర్,రాజేశ్వర్ రావు,ఆలయ సీనియర్ అసిస్టెంట్ రాజేష్,సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


