- Advertisement -
నవతెలంగాణ – రాయపర్తి
మైలారం గ్రామస్తుల ఇలవేల్పైన దుర్గమ్మ గుడి ఆలయంలో హుండీ చోరీకి గురైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని మైలారం గ్రామ శివారులోని దుర్గమ్మ ఆలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆలయం తాళం పగలగొట్టి హుండీలోని సుమారు 15 తులాల వెండి, సుమారు ఐదు రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు వివరించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోయిని కుమారస్వామి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
- Advertisement -