రోజు ఇంట్లో తినే ఆహారం గురించి కాదు. బయట తినే ఆహారం ఎంత పరిశుభ్రంగా ఉందనేది మనం ఆలోచించం. ఆకలైందంటే చాలు కనిపించింది తినేస్తాం. బిస్కెట్ దగ్గర నుంచి బిర్యానీ వరకు, మంచినీళ్ల నుంచి మజా వరకు, చారు నుంచి సమోసా వరకు ఏది దొరికినా దాన్ని తిని ఆకలి తీర్చుకుంటాం. కానీ ఆ సమయంలో రుచి మాత్రం గుర్తుకు రాదు. తిన్న తర్వాత తెలుస్తుంది దాని ప్రభావం. ఇది అందరికీ ఎదురవుతున్న సమస్యే. కానీ ఆకలి సమయంలో రుచి గురించి ఆలోచించడం, ఒకవేళ రుచి బాగా ఉన్నదనుకున్నా…కల్తీ గురించి ఆలోచించం. అన్ని చోట్ల కల్తీ జరుగుతుందని చెప్పం..కానీ మంచి నూనె కల్తీ ఏవిధంగా చేస్తున్నారో వంటమనిషే స్వయంగా చెప్పడంతో విని షాక్ అయ్యాను. మారిన పరిస్థితుల్లో పెండ్లిళ్లు, పంక్షన్లు ఎంత ఘనంగా చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఎన్ని రకాల ఆహార పదార్ధాలను వడ్డిస్తున్నారో తెలుసు. అన్నింటిలో మంచినూనె వాడకం కామన్.
ఒక ఫంక్షన్‌లో చికెన్, ఫిష్ డీప్రై చేసిన తర్వాత మిగిలిన నూనె ఎక్కడిపోతుందనేది ప్రశ్న. దాన్ని రహస్యంగా మార్కెట్ చేస్తారనే విషయం మనలో ఎంతమందికి తెలుసు? లీటర్లకొద్ది మిగిలిన నూనెను కొనేందుకు హైదరాబాద్‌లో కొన్ని అడ్డాలున్నాయి. నూనె లీటర్‌కు రూ.150 ఉంది. వాడిననూనె లీటర్‌కు పది రూపాయల చొప్పున కొంటారు. వడగట్టి ఆ నూనె మరొక ఫంక్షన్‌లో ఉపయోగిస్తారు. ప్రెష్ నూనె పది డబ్బాలు వాడితే అందులో కనీసం రెండు, మూడు డబ్బాల నూనె కలిపి వంటల్లో వాడుతారు. ఆ నూనెను గుర్తించకుండా ఉండేందుకు రంగులు కలుపుతారు. దీంతో ఎన్ని రోజులైన నిల్వ ఉంటుంది. ఆ నూనెతో చేసిన ఆహార పదార్థాలనే మనం లొట్టలేసుకుని తింటాం. ఆ రుచి మాటున ఎంత ప్రమాదకరమైన భోజనం చేస్తున్నామో ఇప్పుడర్థమైంది కదూ..సొ..బీ కేర్ ఫుల్!
గుడిగ రఘు
ఆకలి రుచి ఎరగదు..కానీ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


