Friday, December 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎంపీటీసీ, సర్పంచ్ పదవులు భార్యాభర్తల కైవసం

ఎంపీటీసీ, సర్పంచ్ పదవులు భార్యాభర్తల కైవసం

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
గత 2013 ప్రాదేశిక ఎన్నికల్లో చింతగూడ గ్రామ ఎంపీటీసీగా సుతారి సుమలత గెలుపొందింది. ఐదు సంవత్సరాలు ఎంపీటీసీ పదవి కాలం పూర్తి చేసింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగి చింతగూడ నుంచే సర్పంచ్ గా పోటీ చేసింది. ఇప్పుడు సర్పంచ్ గా కూడా ఆమె విజయం సాధించింది. కాగా.. ఆమె భర్త వినయ్ 2019 ప్రాదేశిక ఎన్నికల్లో చింతగూడ నుంచే ఎంపీటీసీగా గెలుపొంది మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక రాజకీయాల్లో ఎంపీటీసీ, సర్పంచులుగా ఉండడంతో అందరి దృష్టి వీరిమీదనే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -