నవతెలంగాణ – హైదరాబాద్: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామ సర్పంచి వివాహేతర సంబంధం తీవ్ర కలకలం రేపింది. విజయనగరంలోని ఒక లాడ్జిలో ఆయన మరో మహిళతో ఉండగా.. ఆమె భర్త వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పోలీసుల కథనం ప్రకారం గతంలో వైఎస్సార్‌సీపీ నాయకుడిగా పనిచేసి, ఆ తర్వాత జనసేనలో చేరిన సదరు సర్పంచ్.. ఒక మాజీ మంత్రి సోదరుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు.
ఇక, భోగాపురం మండలానికి చెందిన మహిళకు 16 ఏళ్ల క్రితం డెంకాడ మండలానికి చెందిన వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సర్పంచి ఆ మహిళను మళ్లీ వివాహం చేసుకున్నట్టు సమాచారం. తన భార్యను సర్పంచితో లాడ్జిలో చూసిన భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సర్పంచ్‌ను పట్టుకున్న ఆయన బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.