Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅన్నపూర్ణ స్టూడియోలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

అన్నపూర్ణ స్టూడియోలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. నీవ్యా అనే మహిళపై భర్త రాజన్ పెట్రోల్ పోసినిప్పండించడంతో గాయాలు అయ్యాయి. నివ్యా అన్నపూర్ణ ఫిలిం అకాడమీలో అడ్మిన్ కౌన్సిలర్ గా పని చేస్తుంది.. అయితే వెంటనే అప్రమత్తమైన స్టూడియోలో ఉన్న సిబ్బంది భర్తను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఇక ఈ ఘటనలో నివ్యా కు స్వల్ప గాయాలు కాగా ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ల్యాప్ టాప్ కాలిపోయాయి.. భార్య నివ్యా తనపై కేసు పెట్టి తనకు దూరంగా ఉంటుందని కోపంతో దాడి చేసాడు భర్త రాజన్. ఇక ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img