Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుHussain Sagar Lake: నిండుకుండలా హుస్సేన్ సాగర్

Hussain Sagar Lake: నిండుకుండలా హుస్సేన్ సాగర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో నగరం మొత్తం వర్షపు నీరు పోటెత్తింది. ఈ క్రమంలో కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ వైపు నుంచి హుసేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో, హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది.హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514 మీటర్లు కాగా… ఈ మధ్యాహ్నం నీటిమట్టం 513.63 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం సాగర్ కు 1,234 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా… ఔట్ ఫ్లో 1,523 క్యూసెక్కులుగా ఉంది. నీటిని దిగువకు వదులుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img