Monday, October 27, 2025
E-PAPER
Homeఆటలుహైదరాబాద్‌ 435/10

హైదరాబాద్‌ 435/10

- Advertisement -

పుదుచ్చేరితో రంజీ మ్యాచ్‌

పుదుచ్చేరి : రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డి రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించింది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (114, 175 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతకానికి తోడు తన్మయ్ అగర్వాల్‌ (50, 110 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హిమతేజ (66, 159 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), రాహుల్‌ రాడేశ్‌ (81, 161 బంతుల్లో 10 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదంతొక్కారు. రోహిత్‌ రాయుడు (34), అనికెత్‌ రెడ్డి (18), తనయ్ త్యాగరాజన్‌ (14) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. 134.5 ఓవర్లలో 10 వికెట్లకు హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 435 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో 1 వికెట్‌కు 25 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకో 410 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -