Saturday, March 14, 2026
E-PAPER
Homeబీజినెస్గ్లోబల్‌హబ్‌గా హైదరాబాద్‌

గ్లోబల్‌హబ్‌గా హైదరాబాద్‌

- Advertisement -

– జర్మన్‌ ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ ను తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బ్రిక్స్‌ దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులకు అనువైన వాతావరణం, ఆధునిక సాంకేతికతల ప్రభావంపై అధ్యయనం చేయడానికి విచ్చేసిన జర్మన్‌ ప్రతినిధి బందంతో పాటు ‘గ్లోబల్‌ బ్రిడ్జెస్‌’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి వారితో చర్చించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ సరఫరా, నీటి లభ్యతలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా మెరుగైన పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూ పరిశ్రమలకు స్థిరత్వాన్ని కల్పిస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ‘ఫ్యూచర్‌ సిటీ’ ప్రాజెక్టును ప్రస్తావించారు. పరిశ్రమలకు నిపుణుల కొరత తలెత్తే సమస్యే ఉండదని భరోసా ఇచ్చారు. తమ ప్రయత్నాలకు జర్మనీ సాంకేతికత తోడైతే ఇంజనీరింగ్‌ రంగంలో మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చని చెప్పారు. సమావేశంలో జర్మన్‌ ప్రతినిధి బృందం సభ్యులు డాక్టర్‌ స్టెఫాన్‌ ట్రేగర్‌, డాక్టర్‌ క్రిస్టియన్‌ అల్టెన్‌ హోఫెన్‌, ఫ్రాంక్‌ బీర్‌ హోస్ట్‌, అలెగ్జాండర్‌ వాన్‌ క్రామ్‌, మాల్టె హొV్‌ా ఫీల్డ్‌, ఫిలిప్‌ మేయర్‌ హోఫర్‌, మ్యాక్స్‌ మిల్లన్‌ వ్యాన్‌ లెయర్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి కూడా హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -