Thursday, December 4, 2025
E-PAPER
Homeబీజినెస్UPI: డిజిటల్ చెల్లింపులలో హైదరాబాద్ 32% వృద్ధి

UPI: డిజిటల్ చెల్లింపులలో హైదరాబాద్ 32% వృద్ధి

- Advertisement -




·భారతదేశం డిజిటల్ కు మార్పు: వేగంగా డిజిటల్ చెల్లింపుల విస్తరణను ద కియార్ని- అమేజాన్ పే అధ్యయనం తెలియచేసింది. రిటైల్ డిజిటల్ లావాదేవీలు 2030 నాటికి $7ట్రిలియన్ దాటుతాయని అంచనా వేయబడింది.

· పెద్ద , మధ్యస్థమైన పరిమాణం గల నగరాల్లో వినియోగం పెరుగుతోంది : పెద్ద , మధ్యస్థమైన పరిమాణం గల నగరాల్లో 56% వినియోగదారులు ఆఫ్ లైన్ కొనుగోళ్ల కోసం ఇప్పుడు డిజిటల్ విధానాలకు ప్రాధాన్యతనిస్తున్నారు, ఇది మెట్రోలతో అంతరాన్ని (62%) తగ్గిస్తుంది.

· వేగం పుంజుకున్న దక్షిణాది ప్రాంతాలు : దక్షిణ భారతదేశంలో పెద్ద , మధ్యస్థ పరిమాణం గల హైదరాబాద్ సహా నగరాలు అత్యధికంగా UPIని వినియోగించిన డిజిటల్ ప్రవర్తనను చూపించాయి, ఆఫ్ లైన్ లో 35% , ఆన్ లైన్ చెల్లింపుల్లో 52% UPI తో చెల్లించబడ్డాయి.

· పెరిగిన అమేజాన్ పే ప్రాధాన్యత : తెలంగాణలో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సమయంలో, 4 కస్టమర్లలో 1 అమేజాన్ పేని వినియోగించారు. 4 ఆర్డర్లలో 1 UPIతో చెల్లించబడింది , UPI యూజర్లు ప్రతి ఏడాది 10% వృద్ధి చెందుతున్నారు.

నవతెలంగాణ హైదరాబాద్ : తమ రోజూవారీ లావాదేవీల్లో వినియోగదారులు UPI , క్యాష్ లెస్ విధానాలను వినియోగించడం పెరుగుతున్న కారణంగా అత్యధిక -వృద్ధి గల డిజిటల్ చెల్లింపుల మార్కెట్ గా తెలంగాణా అభివృద్ధి చెందుతోందని 120 నగరాల్లో 6,000 మంది కస్టమర్లపై చేసిన ఒక సర్వే ఆధారంగా హౌ అర్బన్ ఇండియా పేస్ 2025 నివేదిక నుండి సేకరించిన అంశాలు తెలియచేస్తున్నాయి. ప్రధానమైన మెట్రోపాలిటన్ ప్రాంతాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ డిజిటల్ చెల్లింపులను ఉపయోగించే ధోరణులను ఈ సర్వే వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో పెద్ద , మధ్యస్థ పరిమాణం గల నగరాలు శక్తివంతమైన UPI వాడకాన్ని చూపించాయని నివేదిక తెలియచేసింది. ఆఫ్ లైన్ లావాదేవీల్లో 35% , ఆన్ లైన్ కొనుగోళ్లల్లో 52% UPIచే ప్రోత్సహించబడ్డాయి. హైదరాబాద్ లోని కస్టమర్లు అవసరమైన , వివేచన గల వ్యయం కోసం వాలెట్స్ , క్రెడిట్ కార్డ్స్ వంటి కొత్త డిజిటల్ ఫార్మాట్స్ ను విశ్వశిస్తున్నారు. వేగవంతమైన, నిరంతరమైన, సురక్షితమైన చెల్లింపు అనుభవాలను ఇవి చూపిస్తున్నాయి.

హైదరాబాద్ వంటి పెద్ద నగరాలు ప్రధానమైన మెట్రోలతో వేగంగా ఈ అంతరాన్ని తగ్గిస్తున్నాయి. ప్రధానమైన ఆరు మెట్రోలలో, ఆన్ లైన్ కోసం 89% , ఆఫ్ లైన్ కొనుగోళ్ల కోసం 62% డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్, మధ్యస్థ పరిమాణం గల నగరాలు ఇప్పటికే 56% ఆఫ్ లైన్ డిజిటల్ చెల్లింపులు అనుసరిస్తున్నాయి, ఇది ఈ మార్కెట్లు ఎంత వేగంగా డిజిటల్ చెల్లింపులను అనుసరిస్తున్నాయో సూచిస్తోంది. పెరుగుతున్న నమ్మకం, UPI, వాలెట్ వాడకంలో నిరంతర వృద్ధితో, క్యాష్ లెస్ వాణిజ్యం దిశగా తెలంగాణ పరివర్తనం చెందడం అనేది హైదరాబాద్ ను భారతదేశంలోనే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఒక ముఖ్యమైన వేదికగా నెలకొల్పుతుంది.

“హైదరాబాద్ దక్షిణ భారతదేశం డిజిటల్ పరివర్తనలో ముందరి స్థానంలో ఉంది. UPIని వినియోగించడంలో సంవత్సరానికి 33%పెరుగుదల కస్టమర్ నమ్మకాన్ని లోతుగా ప్రదర్శిస్తోంది”, అని వికాస్ బన్సల్, CEO, అమేజాన్ పే ఇండియా అన్నారు. “గృహావసరాల నుండి అత్యధిక విలువ కలిగిన కొనుగోళ్ల వరకు, డిజిటల్ చెల్లింపులు డీఫాల్ట్ ఎంపికగా మారాయి. ఈ పెరుగుదల నిజాయితీ, వేగాన్ని విలువైనదిగా భావించే కస్టమర్లను ఈ వృద్ధి ప్రతిబింబిస్తుంది. వ్యాపారులు డిజిటల్ ఆమోదాన్ని వేగంగా స్వీకరించడం ద్వారా మద్దతు లభిస్తుంది. భారతదేశంలో అత్యంతగా డిజిటల్ ఆత్మవిశ్వాసం కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా హైదరాబాద్ తన స్థానాన్ని శక్తివంతం చేసిన కారణంగా, తెలంగాణలో వినియోగదారులు , వ్యాపారులు ఇరువురికి ఉపయోగపడే నమ్మకమైన చెల్లంపు పరిష్కారాలను కేటాయించడానికి మేము కట్టుబడ్డాము”.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -