Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు

మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు

- Advertisement -

నవతెలంగాణ – మియాపూర్ : శేర్లింగంపల్లి మండలం మక్త బాబుపేట విలేజ్ పరిధిలోని 44 / 5 సర్వే నంబర్ లో గల 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యక్తులు కొద్ది సంవత్సరాలుగా షెడ్లను ఏర్పాటు చేసుకొని వాటిని కిరాయికి ఇచ్చారు. ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా అనుభవిస్తున్నారని కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు సోమవారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. కూల్చివేతల అనంతరం కంచెను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించుకున్న కఠిన చర్యలు ఉంటాయని హైడ్రా అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -