నవతెలంగాణ – హైదరాబాద్: ‘హైడ్రా.. ఒకటి రెండేళ్లకు పరిమితం కాదు. వందేళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తోంది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం ఆరు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. సీఎస్‌ఆర్ పేరుతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. చెరువుల వద్ద భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్నాయి. వీటితో పాటు నాలాలను నోటిఫై చేస్తున్నాం’ అని రంగనాథ్ తెలిపారు.
ఏడాదిలో 500 ఎకరాల భూమిని కాపాడినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వందేళ్లకు ఉపయోగపడేలా హైడ్రా పనిచేస్తుందన్నారు. ఇలాంటి సంస్థ దేశంలోనే మొదటిది అని రంగనాథ్ అన్నారు. వెదర్ ఫోర్ కాస్ట్ చేయడానికి మన దగ్గర డేటా లేదని.. డేటా పెంచాలంటే సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్ పెంచాలన్నారు.