- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నాలాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే 4 నెలల పాటు ఈ అంశంపైనే దృష్టి పెడుతున్నట్టు ఆయన తెలిపారు. వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేయనున్నట్టు పేర్కొన్నారు. నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని.. పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రసూల్‌పురా నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్ చెప్పారు.
- Advertisement -