నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఉపాధ్యాయుల యొక్క వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం సంతోషంగా ఉందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తమతోటి విద్యార్థులకు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు పాఠ్యాంశాలను బోధించారు.
అనంతరం పాఠశాలల నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ గుండోజి దేవేందర్ అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు మాట్లాడుతూ తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులను అనుకరించి తోటి విద్యార్థులకు బోధించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌమ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



