Sunday, July 6, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినేను నానాలే...

నేను నానాలే…

- Advertisement -

‘పుర్రెకో బుద్ధి, జిహ్వాకో రుచి…’ అన్నారు పెద్దలు. కొందరు టీ అంటే పడిచస్తారు. మరికొందరు హైదరాబాద్‌ బిర్యానీని మెతుక్కూడా వదలకుండా తింటారు. ఇదే రకంగా కొందరికి టీవీ చూడటమంటే మహా ఇష్టం. ఇంకొందరికి ఆ టీవీ వార్తల్లో నిలవటమంటే మహా మహా ఇష్టం. ఈ కోవలోకి రాజకీయ నాయకులే ఎక్కువగా వస్తుంటారు. పత్రికలు, ఛానళ్లలో తమ పేరు, ఫొటో రోజూ రావాలి, రోజూ జనం తమ గురించి చర్చించు కోవాలన్నది వారి తపన, తాపత్రయం. అందుకే కాబోలు.. విషయం, విధానపరమైన అంశాలేవీ లేకపోయినా ఎదుటోణ్ని, ఎగస్పార్టీని తిట్టటం ద్వారా తెగ ఫేమస్సే పోవాలని ఆరాటపడుతుంటారు ఈ బాపతు లీడరు మహా శయులు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరూ ఇదే రకంగా తయారయ్యా రనుకోండి. శనివారం హైదరాబాద్‌లో ఇలాంటి నాయకుడొకరు తగిలారు. ‘అరే భరు… మీరు నామీద ఏదన్న రాసుకోండి, తిట్టిండని రాసుకోండి, కొట్టిండని రాసుకోండి, ఆఫీసులోకి రానీయ్యలేదని నెగెటివ్‌ ప్రచారం చేసుకోండి.. మీ ఇష్టం.. ఏదైనా రాసుకోండి.. నేను నానాలే.. మీడియాలో రోజూ నానాలే..ఇంతకుముందు కంటే మరింత ఫేమస్‌ గావాలే.. నా టార్గెట్‌ అదే…’ అంటూ పాత్రికేయులకు దిశా నిర్దేశం చేశారు ఆ లీడర్‌. అదే ఇప్పుడు జర్నలిస్టులకు ‘జీవన్‌’మరణ సమస్యగా మారింది.
-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -