Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేను నాయకుని కాదు.. మీ సేవకుడిని 

నేను నాయకుని కాదు.. మీ సేవకుడిని 

- Advertisement -

ఆదరించండి.. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా 
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు
నవతెలంగాణ – అచ్చంపేట
నేను నాయకుని కాదు.. మీ సేవకుడిని. సర్పంచ్ గా ఆదరించండి.. ఉప్పునుంతల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చింతగాళ్ల శ్రీనివాసులు అన్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో కాలనీ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తు, వృద్ధులకు, వికలాంగులకు ప్రతినెలా పింఛన్లు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, పాడి రైతులకు సబ్సిడీ పథకాలు,  ఇలా అనేక  సంక్షేమ పథకాలు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఐదేళ్లపాటు మీ సేవకునిగా పనిచేస్తానని ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

జన్మనిచ్చిన గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఓటర్లు తనకు కల్పించాలన్నారు. మురుగునీరు రోడ్ల మీదికి రాకుండా అన్ని కాలనీలలో డ్రైనేజీల నిర్మాణం, వీధిలైట్ల ఏర్పాటు, అంతర్గత మట్టి రోడ్లను సిసి రోడ్లుగా చేస్తానన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సహకారంతో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి (రాజు) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులు, సెంటర్ లైటింగ్ పనులకు కృషి చేస్తానన్నారు. నిరుద్యోగులకు చదువుకున్న యువకులకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని అభివృద్ధి పరుస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -