Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'ఐబొమ్మ' ఆగింది... 'ఐబొమ్మ వన్' వచ్చింది..!

‘ఐబొమ్మ’ ఆగింది… ‘ఐబొమ్మ వన్’ వచ్చింది..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మను పోలీసులు మూసివేయించిన కొన్ని రోజులకే, మరో కొత్త వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. ‘ఐబొమ్మ వన్’ పేరుతో దాదాపు అవే ఫీచర్లతో కొత్త సైట్ ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారం ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

కొత్తగా ప్రారంభమైన ‘ఐబొమ్మ వన్’ వెబ్‌సైట్ చూడటానికి అచ్చం పాత ఐబొమ్మ లాగే ఉంది. అయితే, పాత సైట్‌లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఉండగా, కొత్త సైట్‌లో ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంచారు. దీని వెనుక రవి అనుచరులు ఉన్నారా? లేక మరెవరైనా ఉన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, అది నేరుగా ‘మూవీ రూల్జ్’ అనే మరో పైరసీ సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్టు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -