Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమీడియా ద్వారానే నాకు స‌మాచారం తెలిసింది: క‌ల‌క‌త్తా లా కాలేజీ వీసీ

మీడియా ద్వారానే నాకు స‌మాచారం తెలిసింది: క‌ల‌క‌త్తా లా కాలేజీ వీసీ

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క‌ల‌క‌త్తాలో లా కాలేజీ విద్యార్థిని లైంగిక దాడి ఘ‌ట‌న‌పై వీసీ వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. కాలేజ్ క్యాంపస్ లో జరిగిన లైంగిక దాడి గురించి మీడియా ప్రసారం చేశాకే తమకు తెలిసిందని లా కాలేజీ వైస్ ప్రిన్సిపల్ నయనా చటర్జీ చెప్పారు. ఆ దుర్ఘ‌ట‌న‌పై బాధితురాలు గానీ, ఇతర విద్యార్థులు గానీ, సిబ్బంది గానీ తమను సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు.

జూన్ 25న ఈ ఘటన జరగ్గా, ఆ మరుసటి రోజు పోలీసులు కాలేజీ ప్రాంగణంలోకి వచ్చేందుకు అనుమతి కోరారని ఆమె తెలిపారు. అయితే, ఇది అధికారిక రహస్య పర్యటన అని చెప్పారని, కనీసం సెక్యూరిటీ గార్డుకు కూడా సమాచారం ఇవ్వవద్దని కోరినట్లు వివరించారు. పోలీసులు కింద అంతస్తులోని రెండు గదులను సీల్ చేశారని, అయితే ఘటన గురించి తమకు శుక్రవారం మీడియాలో చూసేంత వరకు తెలియలేదని ఆమె పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనోజిత్ మిశ్రా తమ కాలేజీ పూర్వ విద్యార్థి అని, కొన్ని నెలల క్రితమే అతడిని తాత్కాలిక అధ్యాపకుడిగా నియమించుకున్నామని చటర్జీ వెల్లడించారు. సిబ్బంది కొరత కారణంగా, రోజుకు 500 రూపాయల వేతనంతో అతడిని నియమించినట్లు తెలిపారు. అధికార పార్టీ విద్యార్థి విభాగంలో పదవిలో ఉన్న మిశ్రా, కాలేజీలో తన ప్రాబల్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించేవాడని నయనా చటర్జీ చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad