Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'అఖండ 2'లో కీలక పాత్ర చేశా..

‘అఖండ 2’లో కీలక పాత్ర చేశా..

- Advertisement -

బాలకృష్ణ నటించిన కొత్త సినిమా ‘అఖండ2: తాండవం’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. 2డి, 3డి రెండు ఫార్మాట్లలో ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సంయుక్త మీడియాతో ముచ్చటించారు. ‘విరూపాక్ష’ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. నేను మాత్రం సెలెక్టెడ్‌గా చేస్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ వెరీ ఇంపార్టెంట్‌ సీక్వెన్స్‌లో చాలా కీలకంగా ఉంటుంది. అలాగే స్టయిలీష్‌గానూ ఉంటుంది. బాలయ్య చాలా ఫ్రెండ్లీ పర్సన్‌. ఆయన్ని తొలిసారి ఒక యాడ్‌ షూట్‌లో కలిసాను. అప్పుడే నేను ఎంతో పరిచయం ఉన్న మనిషి లాగా మాట్లాడారు. ఆయన డైరెక్టర్‌ యాక్టర్‌. డైరెక్టర్‌ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది.

ఆయన నటించడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. తమన్‌ మ్యూజిక్‌ అత్యద్బుతంగా ఉంటుంది. ఇప్పటివరకు రిలీజ్‌ అయిన పాటలు అన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో పాటలు లార్డ్‌ శివకి ట్రిబ్యూట్‌లాగా ఉండబోతున్నాయి. ఇందులో సంస్కృతంలో వినిపించే పదాలు, అద్భుతమైన సాహిత్యం ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాయి. రామ్‌, గోపి చాలా మంచి ప్రొడ్యూసర్స్‌. చాలా సపోర్ట్‌గా ఉంటారు. ఇంత పెద్ద సినిమాని చేయడం నిర్మాతలు సపోర్ట్‌ లేకపోతే సాధ్యం కాదు. అలాగే ప్రమోషన్స్‌ కూడా చాలా అద్భుతంగా చేశారు. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ‘స్వయంభు’లో యాక్షన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. శర్వా ‘నారి నారి నడుమ మురారి’లో చాలా మంచి క్యారెక్టర్‌. అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్‌తో వర్క్‌ చేయడం బెస్ట్‌ ఎక్స్పీరియన్స్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -