Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeమానవినా విద్యార్థులను సైంటిస్టులుగా చూడాలి..

నా విద్యార్థులను సైంటిస్టులుగా చూడాలి..

- Advertisement -

పట్టుదల ఉంటే సాధించొచ్చు
మనలో పట్టుదల, కష్టపడి పనిచేయాలనే తత్వం, స్వీయ క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమి ఉంటుందని అంటారు కానీ అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని విద్యార్థుల కోసం సక్రమంగా వినియోగించి పాఠాలు బోధిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. నా జీవిత లక్ష్యం ఒక్కటే. నేను పాఠాలు బోధించిన విద్యార్థులు సైంటిస్టులుగా ఎదగాలన్నదే నా ఆశ.
– మారం పవిత్ర

ఉపాధ్యాయులంటే పిల్లలకు కేవలం అక్షరాలు నేర్పే వారు మాత్రమే కాదు. విద్యార్థులు జీవితంలో మంచి మార్గంలో నడిచేలా తీర్చిదిద్దే గురువులు. మన సమాజానికి భావిభారతాన్ని అందించే హహౌన్నతులు. అలాంటి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెస్తున్న గురువులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు జీవశాస్త్ర ఉపాధ్యాయు రాలు మారం పవిత్ర… సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాలో మన రాష్ట్ర్రం నుండి స్థానం దక్కించుకున్న ఆమెతో మానవి సంభాషణ…

మీ కుటుంబ నేపథ్యం..?
మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర తడకమళ్ల గ్రామం. నాన్న శంకర్రెడ్డి, అమ్మ కళమ్మ, చెల్లి సునిత. మాది వ్యవసాయదారుల కుటుంబం. చెల్లి ప్రైవేటు టీచర్‌గా చేస్తుంది. మా నాన్న, నేను నాలుగవ తరగతిలో ఉండగా చనిపోయారు. నా స్కూల్‌ ఎడ్యూకేషన్‌ మొత్తం జెడ్పీహెచ్‌ఎస్‌ తడకమళ్ల, వేములపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. ఇంటర్‌ తర్వాత ఎంసెట్‌ రాశాను. పధ్నాలుగు వేల ర్యాంక్‌ వచ్చింది. కోచింగ్‌కు వెళితే మెడిసిన్‌ వచ్చేది. అప్పట్లో ముఫ్పై వేలు ఖర్చు అవుంతుందని అమ్మ పంపలేదు.
మరి టీచర్‌ వృత్తిలోకి ఎలా వచ్చారు?
పెండ్లి చేస్తే వారే చదివించుకుంటారని అమ్మ అనుకుంది. ఆ ఆలోచనతోనే డిగ్రీ సెంకడ్‌ ఇయర్లో నా పెండ్లి చేసింది. తర్వాత నా భర్త నాతాల మన్మథరెడ్డి నా డిగ్రీ కంప్లీట్‌ చేయించారు. తర్వాత బీఈడీ, ఎంఇడి కూడా చేయించారు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండటంతో నేను కూడా బాగా చదువుకొని ఆ వృత్తిలోకి రావాలని, అందుకు ప్రిపరేషన్‌ కావాలని నన్నెంతో ప్రోత్సహించారు. దీంతో నేను 2008లో డీఎస్సీ రాసి ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తొలుత ఆత్మకూరు (ఎస్‌) మండలంలోని రామన్నగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో నా పోస్టింగ్‌. తర్వాత గోరంట్ల, గడ్డిపల్లి స్కూల్లో పనిచేశాను. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పెన్పహాడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. నా భర్త కొక్కొరేణిలో బయోసైన్స్‌ టీచర్‌గా వర్క్‌ చేస్తున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలి ఎంపిక ప్రక్రియ ఎలా జరిగింది?
మన రాష్ట్రం నుండి 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలన తర్వాత వాటి నుండి 77 మందిని జ్యూరీ ఎంపిక చేసింది. వీరి నుండి స్టేట్‌ జ్యూరీ టాప్‌ 15 మందిని ఎంపిక చేసింది. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఈ 15 మందికి ఇంటర్వ్యూలు పెట్టారు. ఆ ఇంటర్వ్యూలో స్టేట్‌ జ్యూరీ మెంబర్స్‌తో పాటు నేషనల్‌ నుండి ఒక జ్యూరీమెంబరును పిలిచారు. వీరంతా మాట్లాడి ఆరుగురిని ఎంపిక చేశారు. ఆగస్టు 13న డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యూకేషన్లో అందరినీ ఇంటర్వ్యూ చేశారు. ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా, ఫెర్మామెన్స్‌ క్రైటీరియా అనే రెండు అంశాలను పరిశీలించారు. వీటిలో ఎవరు బెటర్‌ అనేది పరిశీలించి ఒకరిని ఫైనల్‌ చేశారు. ఆ ఒక్కరు నేను కావడం నాకు వచ్చిన మంచి అవకాశంగా భావిస్తున్నాను. కలెక్టర్‌ తేజస్‌ నందన్‌ పవార్‌ నన్ను అభినందించారు. ఈ అవార్డు రావడం ఉపాధ్యాయ వృత్తికి దక్కిన అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకూ నేను చేసిన ప్రయోగాలకు ఒక గుర్తింపు వచ్చిందని భావిస్తున్నాను.
ఉపాధ్యాయురాలిగా పిల్లల కోసం మీరు చేసిన ప్రయోగాల గురించి చెబుతారా?
మన రాష్ట్రం నుండి 150 మందిలో నేను ఎంపిక అవ్వడం వెనుక నేను నా సర్వీసులో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చేసిన ఎన్నో ప్రయోగాలు దోహదం చేశాయి. పిల్లలకు పాఠాలు చెప్పి వదిలేయకుండా విద్యార్థులను ఎన్నో సైన్స్‌, పోటీ కార్యక్రమాలకు తీసుకెళ్లాను. ఇన్నోవేటివ్‌ టీచింగ్‌ స్టాటజీ ద్వారా పిల్లలకు బయోలజీ నేర్పించడం, కార్డు గేమ్స్‌ అండ్‌ బోర్డు గేమ్స్‌ ద్వారా విజ్ఞానం పెంపొందించడం వంటి వినూత్న ప్రయోగాలు చేశాను. పిల్లల చేతనే యాక్టివిటీస్‌ చేయించి వారితోనే వివరించి చెప్పించడం వంటివి చేశాను. పిల్లలను రకరకాల సైన్స్‌ కాంపిటేషన్స్‌కు, ఇన్స్పైర్‌, నేషనల్‌ చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, అగస్య, అన్వేషణ వంటి సైన్స్‌ కాంపిటేటివ్‌ ప్రోగ్రామ్స్‌కు తీసుకెళ్లాను. ఇప్పటి వరకు మా విద్యార్థులు 30 రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. వాటిలో కొన్ని జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రదర్శించారు. కలెక్టర్‌, విద్యా మంత్రి, అగ్రికల్చర్‌ మినిస్టర్‌ నుండి కూడా మా పిల్లలు ప్రశంసలు అందుకు న్నారు. గడ్డిపల్లిలోని పాఠశాలలో పనిచేస్తున్న సమయం లో చేసిన అలాంటి ఓ వీడియో సీఆర్‌టి వాళ్ల అఫిషియల్‌ యూటూబ్‌ ఛానల్‌లో కూడా ప్రసా రం అయింది. టెక్ట్‌బుక్‌ రైటింగ్లోనూ, ఇన్నోవేటివ్‌ టీచింగ్‌ స్టాటజీ, పిల్లలను ఇన్నోవే టివ్‌ వైప నడిపించడం వంటివి చేస్తున్నాను. విద్యావారధి ప్రోగ్రాం ద్వారా నా స్టూడెంట్స్‌ యూఎస్‌ విద్యార్థులతో ఇంటరాక్టివ్‌ అయ్యేవారు. యూఎస్‌ కల్చర్‌, వారి స్కూలు పరిస్థితులు వంటివి చర్చించి నాలెడ్జ్‌ ఎక్సేంజ్‌ చేసుకునే వారు.

  • పుప్పాల మట్టయ్య, నల్లగొండ.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad