హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – జమ్మికుంట : నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం ఇంటింటికీ మన కౌశిక్ అన్న కార్యక్రమం ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుందని అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడైనా కష్టాల్లో ఉంటే, వెంటనే అండగా నిలుస్తామని అన్నారు. జమ్మికుంట మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన వొల్లల రవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ 2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి తన పూర్తి మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.
జమ్మికుంట పట్టణం, జమ్మికుంట మండలంలో మాచనపల్లి, జగ్గయ్యపల్లి, అంకుశాపూర్, కోరపల్లి, బిజ్జిగిరి షరీఫ్, వావిలాల, నగురం, నాగారం, ఇల్లందకుంట మండలంలో రాచపల్లి, టేకుర్తి, మర్రివానిపల్లి, మల్యాల, లక్ష్మాజీపల్లి, కనగర్తి, ఇల్లందకుంట గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జమ్మికుంట టౌన్ 6,20,000 విలువైన 19 చెక్కులు, జమ్మికుంట రూరల్ 2,77,000 విలువైన 13 చెక్కులు, ఇల్లందకుంట మండలం 2,31,000 విలువైన 13 చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం ఏమైందని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రైతులు సాగునీటి కొరతతో బాధపడుతున్నారని తెలిపారు. రైతు భరోసా అందరికి చేరటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు,పింగిళి రమేష్ ,సత్యనారాయణ రావు మనోహర్ రావు ,పొనగంటి సంపత్ ,తోట లక్ష్మణ్ ,తిరుపతి రావు, పర్లపల్లి రమేష్, ఇల్లందకుంట మండలంలో సరిగొమ్ముల వెంకటేష్ ,చుక్క రంజిత్ ,పోడేటి రామస్వామి, పసునూటి మహేందర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.