నవతెలంగాణ – మునిపల్లి
గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని మునిపల్లి మండలం మేళాసంఘం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుప్నాగారం లక్ష్మి పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం నాడు గ్రామంలో తన ప్రచార పర్వాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అభ్యర్థి లక్ష్మీ మాట్లాడుతూ తనకు అవకాశం ఇస్తే గ్రామంలోని సమస్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజి ఉపాధ్యక్షులు గౌరెడ్డి గారి నారాయణరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సంగమేశ్వర్, పార్టీ నాయకులు వీర్ శెట్టి, పడమటి సంగన్న,నాయకులు రవీందర్,యువత అధ్యక్షుడు బ్యాగారి మల్లేశం. గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



