బీఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి సల్ల అంజిరెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
చలకుర్తి గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సల్ల అంజిరెడ్డి అన్నారు. సోమవారం గ్రామం లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని అన్నారు.తనను గెలిపిస్తే గ్రామం ప్రతి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా 1116, ప్రతి పేద కుటుంబ ఆడబిడ్డకు పెండ్లి కానుకగా 5116, మృతి చెందిన కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ భరోసాగా 5116 లు ఇస్తానని చెప్పారు.
అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా బెల్టు టైలు బ్యాడ్జీలు అందజేయడం జరుగుతుందని అన్నారు. గెలుపొందిన అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ సొంత ఖర్చులతో ఏర్పాటు,స్మశాన వాటికలో ఉచితంగా బోరు వేసి అడుగుభాగన బండలు వేయడం, పడమటి పూలగూడెం గ్రామంలో నీటి కొరత లేకుండా సొంత ఖర్చులతో ఉచితంగా బోరు వేసి గ్రామానికి దాహార్తి తీర్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కనుక గ్రామస్తులంతా పలుమార్లు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చలకుర్తి ఓటర్లకు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సల్ల అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.



