Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: మంత్రి

గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను మండలంలోని మేళ సంఘం గ్రామ నూతన పంచాయితీ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 238 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కుప్నాగారం లక్ష్మి సంగమేశ్వర్ గెలుపొందిన సందర్భంగా ఆయన పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని గ్రామాభివృద్ధికి,పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని సర్పంచ్ లక్ష్మీ సంగమేశ్వర్ కు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంజయ్య తో పాటు వార్డు సభ్యులు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు గౌరెడ్డి నారాయణరెడ్డి స్థానిక నాయకులు  మాణిక్యప్ప, ఖ్యాతం రవీందర్ రవీందర్ థామస్, సోషల్ మీడియా కన్వీనర్ కల్లపల్లి యాదగిరి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడమటి సంగన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -