Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఏ పదవీ చేపట్టను

ఏ పదవీ చేపట్టను

- Advertisement -

– జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా
– సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ
– నేడు నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ బీఆర్‌ గవారు
న్యూఢిల్లీ:
పదవీ విరమణ తర్వాత ఎలాంటి పదవులు చేపట్టబోనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా చెప్పారు. తదుపరి సీజేఐగా వస్తున్న జస్టిస్‌ బీఆర్‌ గవారు ఓ ‘అద్భుతమైన ప్రధాన న్యాయమూర్తి’ అని కొనియాడారు. మంగళవారం పదవీ విరమణ చేసిన సంజీవ్‌ ఖన్నా చివరిసారిగా పూర్తి ధర్మాసనంలో (ఫుల్‌ బెంచ్‌) ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మీ అభిమానానికి కృతజ్ఞతలు. నేను ఎన్నో అనుభూతులను వెంట తీసుకొని ఇక్కడి నుండి వెళుతున్నాను. అవి నాకు ఎప్పుడూ గుర్తుంటాయి’ అని అన్నారు. అనంతరం తనకు వీడ్కోలు పలికేందుకు కోర్టురూమ్‌కు వచ్చిన న్యాయవాదులను ఉద్దేశించి ప్రసం గించారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగించాలే తప్ప ఆదేశా లతో కాదని చెప్పారు. జస్టిస్‌ ఖన్నా ప్రెస్‌ లాంజ్‌ని కూడా సందర్శించారు. మీ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా పదవీ విరమణ తర్వాత ఏ పదవినీ చేపట్టబోనని, అయితే చట్టానికి సంబం ధించి ఏదో ఒకటి చేస్తానని తెలిపారు. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివాదంపై మీ మనసులో ఏముందని ప్రశ్నించగా న్యాయవాదుల మాదిరిగా కాకుండా న్యాయమూర్తులు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకో వడంపై దృష్టి సారిస్తారని అన్నారు. ‘ఏ విషయంలో అయినా సానుకూ లతలు, ప్రతికూలతలను పరిశీలించి హేతుబద్ధంగా నిర్ణయం తీసుకుం టాం. చేసింది తప్పా ఒప్పా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది’ అని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad