టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
కాంగ్రెస్ లో చేరిన మంచుప్పుల గ్రామస్తులు
కండువాలు కప్పి స్వాగతం పలికిన ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిని కంటికి రెప్పలా కపాడుకుంటానని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలకు ఝాన్సీ రెడ్డి కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, ప్రజలను చైతన్యం చేయాలని పిలపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలకు 10 లక్షల ఆరోగ్యశ్రీ, గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు పంట పెట్టుబడి కోసం రైతు భరోసా, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలను అమలు చేస్తూ పేద ప్రజల మందనలను ప్రజా ప్రభుత్వం పొందుతుందని తెలిపారు. మంచుప్పుల గ్రామానికి చెందిన అడిదల సోమి రెడ్డి, కల్పగిరి యాకయ్య, కాకర్ల మహేష్ కాకర్ల సైదులు,పాలడుగు ప్రశాంత్,జోగు శ్రీను, వక్కల వెంకన్న,మోటే గణేష్, వక్కల మల్లేష్,దాసరి యాకయ్య, దాసరి అశోక్,వరికుప్పల రవి, వరికుప్పల యాదగిరి,దాసరి సతీష్,బుడిగే మల్లయ్య లతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు జోగు పరశురాములు, నాయకులు బండపెళ్లి వెంకన్న, గోలి ప్రవీణ్ రెడ్డి, పడమటిరెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES