వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రఘునందన్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎం రఘునందన్‌రావు హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి శ్యామ్ నేతృత్వంలో రఘునందన్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ సమస్యల గురించి చర్చించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. శాఖను పునర్‌వ్యవస్థీకరణ చేయాలని సూచించారు. గచ్చిబౌలి, శంషాబాద్, సంగారెడ్డి మూడు డివిజన్లను చేయాలని కోరారు. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. ఖాళీగా ఉన్న సీటీవో పోస్టులకు ఎఫ్‌ఏసీ సీనియర్ డీసీటీవోలను నియమించాలని పేర్కొన్నారు.
డీసీటీవో స్థాయి నుంచి జాయింట్ కమిషనర్ స్థాయి వరకు సీనియార్టీ జాబితాలు సిద్ధం చేసి డీపీసీ నిర్వహించాలని కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ సమాచార లోపం వల్ల ఒక సీటీవోకు అదనంగా ఒకటి లేదా రెండు సర్కిల్‌ల అదనపు బాధ్యతలను ఇచ్చామని అన్నారు. దీన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాఖ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో ఇటీవల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 12 జోన్లను ఏర్పాటు చేసిందనీ, అదే తరహాలో డివిజన్ల గురించి ఆలోచిద్దామని అన్నారు. సీనియార్టీ జాబితాల తయారీ, డీపీసీల నిర్వహణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవో మాజీ ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ, వాణిజ్య పన్నుల విభాగం కన్వీనర్ డి కిషన్ ప్రసాద్, కోకన్వీనర్ ఎస్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



