Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫారెస్టు సిబ్బందికి అండగా ఉంటా

ఫారెస్టు సిబ్బందికి అండగా ఉంటా

- Advertisement -

అటవీ అధికారులపై దాడులు చేస్తే పీడీ యాక్టు : అటవీ శాఖ అసోసియేషన్‌ సమావేశంలో మంత్రి సురేఖ
హర్షం వ్యక్తం చేసిన ఫారెస్టు అసోసియేషన్‌ అధికారులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అటవీ సిబ్బందికి ఒక అక్కగా అండగా ఉంటానని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ భరోసానిచ్చారు. అటవీ ఉద్యోగులపై ఎవరైనా దాడులు చేస్తే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌, పీసీసీఎఫ్‌ డాక్టర్‌ సువర్ణ, సునీతా భగవత్‌, రాష్ట్ర అటవీ శాఖ అధికారుల అసోసియేషన్‌ సంఘాలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల సంఘాల నాయకుల తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ… చిన్న చిన్న విషయాలు శాఖపరంగా పరిష్కరించుకుందామన్నారు. కీలక అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిద్దామని హామీనిచ్చారు. అటవీ శాఖకు ఫారెస్టు ఉద్యోగులే ఫ్రంట్‌ రన్నర్స్‌ అనీ, మనమంతా ఒక కుటుంబ సభ్యులమని చెప్పారు. పోలీసులకు ఎటువంటి జీత భత్యాలు ఇస్తున్నారో అటవీ అధికారులకు అంతే స్థాయిలో ఇచ్చేందుకు తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. అటవీశాఖ అధికారులకు అవార్డులను పునరుద్ధరించే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. తమ పట్ల సానుకూలంగా మంత్రి మాట్లాడటం పట్ల అటవీశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

సమావేశంలో ఫారెస్టు అసోసియేషన్‌ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అంశాలు
-మహారాష్ట్ర మాదిరిగా అటవీ భూములను అన్యాక్రాంతం చేసేవాళ్ళను కఠిన చట్టాలతో శిక్షించాలి.
-అటవీ శాఖ బీట్‌ అధికారుల నియామకం వెంటనే చేపట్టాలి. రెండు వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
-ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్ల జోన్‌ పోస్టును డిస్ట్రిక్‌ లెవల్‌ పోస్టుగా చేయాలి.
-క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు బీట్‌, సెక్షన్‌, డీఆర్‌ఓలకు ద్విచక్రవాహనాలు ఇవ్వాలి.
– స్టేట్‌ లెవల్‌లో సెక్షన్లను, బీట్లను పునర్‌ వ్యవస్థీకరించాలి.
– మూడేండ్లకు ఒక్కసారైనా వంద శాతం బదిలీలు చేపట్టాలి.
– ప్రతి జిల్లాకు రెండు, మూడు ఫారెస్టు స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
– సిబ్బందికి అటవీ పరిరక్షణలో భాగంగా ఆయుధాలు ఇవ్వాలి.
– గ్రామీణ ప్రాంతాల్లో అడవుల్లో ఉంటున్న ఫారెస్టు అధికారులకు హెచ్‌ఆర్‌ఏ తీసివేసి రెంట్‌ ఫ్రీ క్వాటర్స్‌ ఇవ్వాలి.
– ఎక్సైజ్‌ శాఖలో రద్దు చేసిన మాదిరిగానే కన్వర్షన్‌ కోటాను ఫారెస్టు డిపార్టుమెంటులోనూ రద్దు చేసి రెగ్యులర్‌ ప్రమోషన్‌ ద్వారానే వాటిని భర్తీ చేయాలి.
– యంగ్‌ ఇండియా స్కూల్‌లో అటవీ శాఖ అధికారుల పిల్లలకు కూడా అడ్మిషన్లు ఇవ్వాలి.
– డిప్యూటీ రేంజర్లకు గెజిటెడ్‌ స్టేటస్‌ ఇవ్వాలి.
– దీర్ఘకాలికంగా విజిలెన్స్‌, ఎన్ఫోర్స్‌మెంట్‌, డిసిప్లినరీ కేసులను పరిష్కరించి న్యాయం చేయాలి.
– పోలీసులకు ఎటువంటి జీతభత్యాలున్నాయో వాటి ఫారెస్టు అధికారులకు అమలు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -