Sunday, July 27, 2025
E-PAPER
Homeకవితమొలిచి గెలుస్తా

మొలిచి గెలుస్తా

- Advertisement -

నీవు చిందులేసి కేకలేసినపుడే
నీ లోపం వెనుక రహస్యం
నా కాళ్ళు పట్టుకుంది.
నీవు రంకేసేసి బారలేసి కొలిచినప్పుడే
నీ ఆశ వెనక అనర్ధం
నా చేతులు పట్టుకుని బ్రతిమలాడింది.
నీవు ఎత్తు పీఠమెక్కి కాలు ఊపినప్పుడే
నీ అంతస్తు వెనుక అహం
నా కళ్ళను చూసి కంగుతిన్నది.
నీవు బలంతో బెదిరించినప్పుడే
నీ బలగం వెనుకున్న బలహీనత అర్థమైంది.
నా కాళ్ళకి వేగాన్ని చూపాయి.
ఖచ్చితమైన చిరునామాతో
నన్ను పోస్ట్‌ చేసుకుంటాను.
చదివి చింపేలోపే చిక్కు ప్రశ్ననౌతా
నీవు బాధించిన ఇష్టమైన చోటే
స్పష్టమైన జవాబునై
మొలిచి గెలుస్తా…
– చందలూరి నారాయణరావు, 9704437247

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -