అవకాశం కల్పించండి… అభివృద్ధి చేసి చూపిస్తా
ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తున్న కృష్ణయ్య
నవతెలంగాణ – మిర్యాలగూడ
పుట్టిన ఊరిలోనే జీవితాంతం ఉండి గ్రామ సేవ కోసం పని చేస్తానని, అవకాశం కల్పించాలని అభివృద్ధి చేసి చూపిస్తానని మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో బిఆర్ఎస్ మద్దతుతో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థి బొగ్గారపు కృష్ణయ్య అన్నారు. సోమవారం మిత్రపక్షాల ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత మీరే నాకు దేవుళ్ళు మీ ఓటు నాకు ఆశీర్వాదమని ఓట్లు అభ్యర్థించారు. పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు గ్రామంలోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్య ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నానని నా లాంటి నాయకులను గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
నీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఒకసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ భరోసనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నూకుల జగదీష్ చంద్ర, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు చీమట మల్లయ్య చీములపాటి వెంకటయ్య, పూల రాంబాబు, చెన్నూరు గిరి సీపీఐ(ఎం) నాయకులు వెంకటేశ్వర్లు నరేష్ వినోదు బొగ్గారపు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.



